గ్రహ సంక్రమణ. ఒక చిన్న పరిశోధన

“సంక్రమణము” అనగా ప్రవేశించడం అని అర్ధము. ఈరోజుల్లో టీవీ చానళ్ల లో జ్యోతిష్యమునకు సంబందించిన ప్రసారాలలో ఈ పదాన్ని మీరు తరచూ గా వింటుంటారు. అలాగే, ఎవరి దగ్గరికయినా మంచి రోజు కనుక్కోవడాని వెళ్ళినప్పుడు కూడా వింటారు. సుర్యగ్రహము (Sun) ఒక్కొక్క రాసి లో ప్రవేశించిన మొదటి రోజును సంక్రాంతి అంటారు. దీన్ని పట్టి మనకి సంవత్సరం లో 12 సంక్రాంతులు వస్తాయి (సౌరమానం ప్రకారం). మీరు గమనించినట్లయితే, సూర్యుడు మకరరాశి (Capricorn) లో ప్రవేశించిన మొదటి రోజును మనం మకర సంక్రాంతి అంటాం (దీన్నేPongal అని తమిళులు అంటారు).

కాని ఈ పోస్టు లో నేను మీకు జ్యోతిషం చెప్పబోవడంలేదు (నాకు వస్తేగా మీకు చెప్పటానికి? 🙂 )

Knome లొ మన Ashok Maharaj గారు నాకు ఒక మంచి మిత్రుడు. ఆయన TCS లో చేరకముందు NASA లో శాస్త్రవేత్త గా పని చేసారు కానున, ఖగోళ శాస్త్రము గురించిన జ్ఞానం ఆయనకు ఎంతగానో ఉంది. మెము తరచు గా మద్యాహ్నభొజనమునకు కలసి వెల్తుంటాం. ఆయన వ్రాసిన ఒక పొస్త్ ద్వారా నాకు Sky Map అనె ఒక software పరిచయమయింది. ఇది రాత్రి పూట పలు నక్షత్రాలను, గ్రహాలను గుర్తించడానికి చాలా ఉపయొగపడుతుంది (మీరు కూడా ప్రయత్నించవచ్చు మీకు వీలు అయినప్పుడు). ఆయితె ఒక రొజు మా నాన్న గారు ఇంటికి వొచ్చిన ఒక్కళ్లకి వివాహ ముహూర్తము నిర్ణయిస్తూ ఉండగా నెను ఆరుబయట నా ఫొన్ ని ఉపయొగించి నక్షత్రాలను గమనిస్తూఉన్నాను.అలా గమనిస్తున్నపుడు అకస్మాత్తు గా ఒక్క విషయం అర్ధమయ్యి, వెంటనె పరిగెత్తుకొని నాన్న దగ్గరకి వెళ్లి ఇలా అడిగాను.

నాన్న, గురు గ్రహము (Jupiter) ప్రస్తుతము ఏ రాసి (Zodiacal Constellation) లొ ఉందొ వెంటనె చెప్పండి.

పాపం ఆయన కి ఎం జరుగుతుందొ అర్ధం కాకపొయినా నా కొసం పంచాంగం తీసి చూశారు.

“నాకు తెలిసి సింహరాశి (Leo Constellation) లొ ఉండాలి.కరక్టేనా ?” అని అడిగాను

ఆయన కొంతసెపు పంచాంగం తిరగవేసి,

“అవును నాన్నా!! గురుడు సింహం లొ ఉన్నడు!!” అన్నారు.

అది విని నాకు సంతొషము ఆగలేదు. వెంటనే మా నాన్నను బయటకు తీసుకువెళ్లి నాకు అర్ధమయినదాన్ని వివరించాను. అది విని ఆయన చాలా ఆశ్చర్యపొయారు (నెను చెప్పిన వివరానికి కాదు. నా Android phone ఇది చెయగలిగినందుకు). నాకు మాత్రం జ్యొతిష్య శాస్త్రాన్ని(Astrology), ఖగొళ శాస్త్రంతొ (Astronomy) జోడించినట్లు అపారమయిన త్రుప్తి కలిగింది. కనుక ఇది ఎలా చెశానొ మీ అందరికి చెప్తాను. మీకుకూడా నచ్చుతందని ఆశిస్తున్నను.


1) మొదట ఆప్ ని మీ ఫొనులొ ఇన్స్టాల్ చెయ్యండి. (లింక్ ఇదుగో Sky Map)

2) ఆప్ ని ఓపెన్ చేసి మీకు కావలసిన గ్రహాన్ని వెదకండి (Search). (దీనికి మీరు మీ ఇంటి మేడ మీదకి వెళ్తే చాలా బాగుంటుంది)

3) అనుకున్న గ్రహం మీకు కనిపించిన (ఆప్త లో మరియు ఆకాశం లో) తరువాత, ఆ గ్రహం ఏ రాశికి (Zodiacal Constellation) దరిదాపుల్లో ఉందో సరిగ్గా గమనించండి. ఈ ఆప్ లో కొన్ని సెట్టింగ్స్ ద్వారా రాశులను మీరు చక్కగా (గీతల ద్వారా) చూడవొచ్చు. అంతే కాదు, వాటి ఆకారాన్ని కూడా చక్కగా గమనించవొచ్చు.

4) అంతే !!!! ఈ విదంగా పంచాంగం అవసరం లేకుండా మీరు గ్రహ రాశులను చెప్పవొచ్చు.


ఇలా నేను చేసిన ఈ చిన్న పరిశోదన యొక్క ఫలితాన్ని ఈ క్రింద చూపుతున్నాను.

Image description not specified.

మీరు కూడా ప్రయత్నించి మీ అనుభూతిని నాతొ చెప్పగలరు. 🙂

Advertisements